నేడు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటన

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు నేడు అమరావతిలో పర్యటించనున్నారు.;

Update: 2024-08-20 03:59 GMT

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా ఈరోజు నుంచి 27వ తేదీ వరకు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించనున్నారు.

చంద్రబాబుతో సమావేశం...
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతిపై కార్యాచరణను ఆ బృందానికి చంద్రబాబు నాయుడు వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News