రాజధానిలో పది శాతం పనులు పూర్తి చేస్తే చాలు

రాజధాని అమరావతిలో 90 శాతం మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేసి రైతులకు అప్పగించాలని యనమల కోరారు

Update: 2022-04-03 12:14 GMT

రాజధాని అమరావతిలో 90 శాతం మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేసి రైతులకు అప్పగించాలని యనమల కోరారు. అమరావతి ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వానికి మరో ఐదేళ్లు గడువు కావాలంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్ పై మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టేందుకే ఇలా అఫడవిట్ ను ప్రభుత్వం దాఖలు చేసిందన్నారు.

కరోనా తో ప్రజలు.....
కరోనా తో ప్రజలు గత రెండేళ్లుగా అల్లాడి పోతున్నారని, ఆర్థికంగా చితికిపోయారని యనమల రామకృష్ణుడు ఆవేదన చెందారు. ఈ సమయంలో జగన్ ఆస్తిపన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్తపన్ను వేయడమే కాకుండా విద్యుత్తు ఛార్జీలను పెంచి మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారన్నారు. పంచాయతీ నిధులను దారి మళ్లించి వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఈ ప్రభుత్వం తయారయిందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.


Tags:    

Similar News