రాజీనామా చేసేశా.. పునరాలోచనే లేదు
తాను అన్ని పదవులకు రాజీనామా చేశానని, ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు
తాను అన్ని పదవులకు రాజీనామా చేశానని, ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. తనకున్న మూడు పదవులకు రాజీనామా చేశానని ఆయన అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ తో తనకున్న ప్రత్యేక అనుబంధం కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తాను అదే రోజున రాజీనామా లేఖలను పంపామని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని యార్లగడ్డ ప్రశ్నించారు. తాను పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి మాత్రం సహకరిస్తానని యార్లగడ్డ తెలిపారు.
గన్నవరం ఎయిర్ పోర్టుకు...
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వకపోవడానికి చంద్రబాబు కారణమని ఆయన తెలిపారు. తాను జగన్ ను ఈ విషయంలో నిందించ దలచుకోలేదన్నారు. 151 సీట్లు సంపాదించుకున్న జగన్ ను తాను ఏమీ అనలేనని ఆయన చెప్పారు. మంచి చేస్తే మంచి చేశానని తాను చెబుతానని తెలిపారు. రాజీనామాపై తాను వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చడం తనకు ఇష్టం లేకపోవడంతోనే తాను పదవుల నుంచి వైదొలిగానని, ఇందులో పునరాలోచించనని కూడా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తేల్చి చెప్పారు. లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు ఆమె ఇష్టమని యార్లగడ్డ అన్నారు.