Ys Jagan : నేడు ప్రచారానికి బ్రేక్.. ముఖ్యనేతలతో సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. గత నెల 28వ తేదీ నుంచి నియోజకవర్గాలను పర్యటిస్తున్న జగన్ నేడు ప్రచారానికి విరామాన్ని ప్రకటించారు. ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కొంత డౌట్ ఉన్న నియోజకవర్గాల నేతలను ఈరోజు జరిగే సమావేశానికి పిలిచారు.
గెలుపు కోసం...
ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అత్యధిక స్థానాలను గెలుపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్ కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను వెనకబడి ఉండటాన్ని గుర్తించి వారితో నేడు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు