Ys Jagan : ఆ ఫైలుపైనే నా మొదటి సంతకం.. అధికారంలోకి రాగానే మళ్లీ వాలంటీర్లు
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ తెస్తానని వైఎస్ జగన్ తెలిపారు
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ తెస్తానని వైఎస్ జగన్ తెలిపారు. నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజలకు అన్ని రకాలుగా సేవలందించేందుకు జూన్ 4వ తేదీన ఆ వ్యవస్థను మళ్లీ తీసుకు వస్తానని తెలిపారు. ఈ రెండు నెలలూ ఓపిక పట్టాలని, తర్వాత మళ్లీ వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి పింఛను ఇస్తారని జగన్ తెలిపారు. చంద్రబాబులా చెప్పి తాను మోసం చేయనని ఆయన అన్నారు. తాను గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశానని చెప్పారు.
వాళ్లంతా నాన్ లోకల్స్...
చంద్రబాబుకు నా అనేవాళ్లంతా నాన్ లోకల్స్ అని అన్నారు. పురంద్రీశ్వరి చంద్రబాబు కోసం బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చి వేశారన్నారు. తాను మంచి చేశాను కాబట్టే ప్రజల్లోకి ఒంటరిగా వస్తున్నానని తెలిపారు. చంద్రబాబు కిచిడీ మ్యానిఫేస్టోతో తాను పోటీ పడదలచుకోలేదని జగన్ అన్నారు. సాధ్యం కానీ హామీలను మ్యానిఫేస్టోలో పెట్టనని అన్నారు. ఇప్పుడున్న పథకాలన్నీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేస్తానని నాయుడు పేట సభలో మాట ఇచ్చారు. మీకు ఎలాంటి నాయకుడు కావాలో తేల్చుకోవాలన్నారు.
అన్నీ ఇంటివద్దకే...
పొత్తులతో జిత్తులతో పనిలేకుండా మీ ముందుకు వచ్చానని అన్నారు. మీ బిడ్డను ఆశీర్వదించాలని కోారరు. మీవరు వేసే ప్రతి ఓటు భవిష‌్యత్ ను నిర్ణయిస్తుందని తెలిపారు. తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు పర్చడమే కాకుండా, పథకాలను నేరుగా ఇంటికి అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా చేయడమే కాకుండా, లంచాలు లేకుండా అన్ని పనులను ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచిపనైనా గుర్తుకు వస్తుందా? అని జగన్ ప్రశ్నించారు.