మ్యానిఫేస్టోలో చెప్పేదే చేస్తా : జగన్
తాను మ్యానిఫేస్టోలో చెప్పేది ఖచ్చితంగా అమలు చేస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
తాను మ్యానిఫేస్టోలో చెప్పేది ఖచ్చితంగా అమలు చేస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వెంకటాచలంపల్లిలో పింఛనుదారులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు39 లక్షల మందికి మాత్రమే పింఛను వచ్చేదని, తాుమ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారందరికీ పింఛన్లు అందచేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం విషయంలో వచ్చిన మార్పును గమనించాలని ఆయన కోరారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడకూడదనే ప్రతినెల ఒకటోతేదీన పింఛన్లు ఇంటికి పంపుతున్నామని తెలిపారు.
నా మొదటి సంతకం ...
వాలంటీర్లు ఇంటికి వచ్చి అవ్వాతాతలకు పింఛన్లను అందచేస్తున్నారని, అయితే నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి పింఛన్లను ఇంటికి పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. వృద్ధులు ఇబ్బంది పడకుండా తాను చేసిన ఆలోచనకు అందరూ ఆనందపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి మొదటి ఫైలుపైనే వాలంటీర్ల వ్యవస్థపై సంతకం పెడతానని జగన్ ఈ సందర్భంగా మాట ఇచ్చారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ పింఛన్లు అందచేశామని చెప్పారు.