Ys Jagan : నేడు ఎన్నికల ప్రచారానికి విరామం
వైసీీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోనే ఉంటారు. కొందరు ముఖ్య నేతలతో సమావేశం అవుతారని సమాచారం. ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. రోజుకు మూడు నియోజకవర్గాలు వరసగా పర్యటిస్తున్న జగన్ మొన్న బ్రేక్ ఇచ్చి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
ముఖ్య నేతలతో ...
నేడు మరోసారి బ్రేక్ ఇచ్చి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయించనున్నారు. గత నెల 27వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేసిన అనంతరం వైసీపీ అధినేత జగన్ వరసగా మూడు నియోజకవర్గాలలో పర్యటిస్తూ రోజూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు మాత్రం ఆయన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.