Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. ఈరోజు బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.;
వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. గత నెల చివరి వారంలో పులివెందుల పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడ రెండు రోజుల పాటు ఉండి ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
మధ్యాహ్నం విజయవాడకు...
బెంగళూరులో ఉన్న జగన్ దంపతులు ఈరోజు బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. జగన్ విజయవాడకు వస్తుండటంతో గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా స్వాగతం పలికేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు నుంచి జగన్ వైసీపీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ పరిస్థితిపై నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.