Ys Jagan : 17వ రోజున మేమంతా సిద్ధం బస్సు యాత్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నేడు తిరిగి ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నేడు తిరిగి ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి బస చేసిన తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర బయలుదేరి తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని అక్కడ భోజన విరామానికి జగన్ ఆగుతారు.
బహిరంగ సభ అనంతరం...
తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్ తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవీ చౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా రాజపురం వద్దచేరుకుంటారు. బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు. జగన్ గత నెల 27వ తేదీన ఇడుపుల పాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న శ్రీరామనవమి సందర్భంగా బస్సు యాత్రకు జగన్ విరామం ప్రకటించారు.