Ys Jagan : జగన్ లండన్ పర్యటన రద్దు?

వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన రద్దయింది. కుటుంబ సభ్యులతో కలసి ఆయన లండన్ పర్యటనకు సిద్ధమయ్యారు.;

Update: 2024-09-06 07:36 GMT
ys jagan, ycp chief, three days,  pulivendula

 ys jagan

  • whatsapp icon

వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన రద్దయింది. కుటుంబ సభ్యులతో కలసి ఆయన లండన్ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఆయన డిప్లొమాట్ పాస్‌పోర్టు రద్దయింది. దీంతో వైఎస్ జగన్ జనరల్ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో పాస్ పోర్టు అనుమతి కావాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు.

ఏడాది పాటు పాస్ పోర్టు
కానీ ఏడాది పాటు మాత్రమే జగన్ కు పాస్ పోర్టు ఇవ్వాలని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు చెప్పింది. అయితే జగన్ తరుపున న్యాయవాదులు మాత్రం సీబీఐ కోర్టు ఐదేళ్లు పాస్ పోర్టుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు. దీనిపై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.


Tags:    

Similar News