లోకేష్‌.. దమ్ముంటే చర్చకు రా: వైసీపీ నేత అనిల్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మాటలు తుటాల్లా పేలుతున్నాయి.

Update: 2023-06-24 10:32 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మాటలు తుటాల్లా పేలుతున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పులకేశి చేసేది పాదయాత్ర కాదు అంటూ లోకేష్‌కు సెటైర్‌ వేశారు. లోకేష్‌.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చునీ, గతంలో పోటీ చేసిన మందలగిరిలో ముందు గెలువు అంటూ వ్యాఖ్యానించారు. శనివారం నాడు అనిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. నారా లోకేస్‌కు సరిగ్గా మాట్లాడటం కూడా రావడం లేదన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, లోకేష్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి అంటూ సవాల్‌ విసిరారు. చంద్రబాబు తన పాలనా కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ను గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కెనాల్‌ పనులు మొదలు పెట్టామన్నారు. టీడీపీ హయాంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో గెలిచి తీరుతామన్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో చేరే చరిత్ర ఆనం రామనారాయణరెడ్డి అంటూ మండిపడ్డారు. అవినీతి చేసిన ఆనం రాంనారాయణరెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్‌ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓడిపోక తప్పదన్నారు. పార్టీలో ఉన్న కలుపు మొక్కలను తామే పీకి బయటపడేశామన్నారు. లోకేష్‌ పాదయాత్ర అట్టర్‌ ప్లాఫ్‌ అని ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. లోకేష్‌ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టమన్నారు. ఎవరెన్నీ పాదయాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. 

Tags:    

Similar News