YSRCP : సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట
సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది. తిరిగి ఆదేశాలు జారీ చేసేంత వరకూ అరెస్ట్ చేయవద్దని తెలిపింది;
సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది. తిరిగి ఆదేశాలు జారీ చేసేంత వరకూ అరెస్ట్ చేయవద్దని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు జారీ చేసింది. విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ గా గౌతమ్ రెడ్డి వ్యవహరించారు. ఆయనపై అనేకకేసులు నమోదయ్యాయి.
అరెస్ట్ చేయవద్దంటూ...
అయితే ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కిరాయి హత్యకు కుట్ర పన్నారన్నఆరోపణలపై కూడా కేసు నమోదయిన నేపథ్యంలో గౌతమ్ రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేయాలని కోరింది.