Andhra Pradesh: నేడు పోలీసుల ఎదుటకు సజ్జల
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేడు మంగళగిరి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు.;
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేడు మంగళగిరి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు.. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పోలీసుల ఎదుటకు రానున్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఆయన సూచనలతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆయనను విచారించేందుకు నేడు పోలీసుల ఎదుటకు రమ్మని నోటీసులు ఇచ్చారు.