విజయవాడకు చేరుకున్న వల్లభనేని వంశీ
వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడకు చేరుకున్నారు;

వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న వెంటనే వల్లభనేని వంశీని మరొక వాహనంలోకి మార్చిన పోలీసులు ఆయనను విజయవాడ నగరంలోకి తీసుకు వెళుతున్నారు. వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్, బెదిరింపుల కేసులు నమోదు కావడంతో ఆయనను విచారించే అవకాశముందని తెలిసింది.
విచారించిన తర్వాత...
ముందు పటమట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఆయనను విచారించిన తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిసింది. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని పోలీసులు తీసుకొస్తుండగా ఆయన సతీమణి తన వాహనంలో వంశీ వెళుతున్న వాహనం వెనక రావడమే గమనించిన పోలీసులు ఆమెను అటు నుంచి అటే హైదరాబాద్ కు వెనక్కు పంపారు.