Breaking : అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు;
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అనకాపల్లి నుంచి బూడి ముత్యాలనాయుడును అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం బూడి ముత్యాలనాయుడు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ ఇన్‌ఛార్జిగా...
మాడుగుల వైసీపీ ఇన్‌ఛార్జిగా బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లి అనురాధ ప్రస్తుతం ఉన్నారు. అందుకే ఆయనను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని జగన్ డిసైడ్ చేశారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్న సమయంలో ఆయనకపై పోటీకి బూడి ముత్యాల నాయుడు ను దించుతున్నారు. 24 పార్లమెంటు స్థానాలను ఒకేసారి ప్రకటించిన జగన్ అప్పుడు అనకాపల్లిని మాత్రం హోల్డ్ లో పెట్టారు.