నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
వైసీపీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఆయన విచారణ కోసం రానున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు నోటీసులు జారీ చేసింది.
వివేకా హత్య కేసు...
అయితే తొలిసారి నోటీసులు జారీ చేసినప్పుడు తనకు ముందుగానే ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడంతో రెండో సారి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న విచారణకు రావాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని వైఎస్ అవినాష్ రెడ్డి చెబుతున్నారు.