నేడు చెవిరెడ్డి ఆత్మీయ సభ
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేడు చంద్రగిరి నియోజకవర్గంలో ఆత్మీ సభను నిర్వహించనున్నారు
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేడు చంద్రగిరి నియోజకవర్గంలో ఆత్మీ సభను నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టిన పనులు, చేసిన అభివృద్ధి పనులను గురించి ఆయన స్వయంగా ప్రజలకు తెలియజేయనున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో..
అయితే ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఏర్పాటు చేసిన సభ వద్దనే ఈ సభను కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ భారీ సభకోసం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి ప్రజలను రప్పించి తాను చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించనున్నారు.