రైతుల యాత్ర రాజకీయ యాత్ర కాదా?

అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్రపై ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సెటైర్ వేశారు;

Update: 2021-12-02 07:57 GMT
kakani govardhan reddy, former minister, nellore police, questioning
  • whatsapp icon

అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సెటైర్ వేశారు. చంద్రబాబు స్పాన్సర్డ్ కార్యక్రమంగా కాకాణి అన్నారు. ప్రస్తుతం రాజధాని రైతుల యాత్ర కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ యాత్రను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

నియోజకవర్గాల్లోకి ఎందుకు?
అమరావతి నుంచి నేరుగా తిరుమలకు చేరుకునే అవకాశమున్నా కొన్ని నియోజకవర్గాలను కావాలనే రైతులు ఎంచుకున్నట్లు కనపడుతుందని కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యా‌ఖ్యానించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు సంపాదించి పెట్టాలనే చంద్రబాబు ఈ యాత్రను తిప్పుతున్నారని ఆయన అన్నారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని, యాత్రను ఎందుకు అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. తాము అడ్డుకోవాలనుకుంటే యాత్ర జరగదని కూడా ఆయన అన్నారు.


Tags:    

Similar News