Breaking : పవన్ తో భేటీ అయిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ‌ తో కొద్దిసేపటిక్రితం భేటీ అయ్యారు;

Update: 2024-01-24 11:42 GMT

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తో కొద్దిసేపటిక్రితం భేటీ అయ్యారు. గూడూరు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వరప్రసాద్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్‌కు ఈసారి వైసీపీలో సీటు దక్కలేదు.

గూడూరు ఇన్‌ఛార్జిగా...
ఆయన స్థానంలో గూడూరు ఇన్‌ఛార్జిగా మేరిగ మురళిని నియమించింది. దీంతో వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చ జరుగుతుంది. తాను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వరప్రసాద్ పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఆయనకు పవన్ నుంచి ఎలాంటి హామీ మాత్రం రాలేదని చెబుతున్నారు.


Tags:    

Similar News