విజయసాయిరెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో ఎవరంటే?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.;

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను వైస్ ఛైర్మన్ జగదీప్ థన్ ఖడ్ కు సమర్పించారు. దీంతో కూటమి ఖాతాలో ఏపీ నుంచి మరో రాజ్యసభ పదవి పడనుంది. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి, ఒకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు.
మరొక స్థానం ఖాళీ...
తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో మరొక స్థానం ఖాళీ అవుతుంది. తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన నిన్ననే ఎక్స్ లో తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని కూడా తెలిపారు. తాను వ్యవసాయానికే పరిమితం అవుతానని, రాజకీయాల గురించి పట్టించుకోనని ఆయన తెలిపారు. వైఎఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉండగా ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.