బాబు బర్త్‌డే : సాయిరెడ్డి ట్వీట్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తొలిసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తొలిసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎన్నడూ ఆయన ఇలా చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెప్పలేదు. అయితే ఇటీవల తారకరత్న మరణంతో విజయసాయిరెడ్డి కుటుంబం, నందమూరి కుటుంబం దగ్గరయింది. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా తగ్గాయి.
తొలిసారిగా...
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు."టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా." అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు. కానీ ఎన్నడూ లేని ఈ అలవాటు ఏంటని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తుండటం విశేషం.