తెలంగాణ, ఏపీలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలి : విజయసాయిరెడ్డి
కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని వారికి ఫిర్యాదు చేశారు. జనసన గుర్తింపులేని పార్టీ అని, దానిని ఎలా అనుమతించారని ఎన్నికల కమిషన్ ను తాము ప్రశ్నించామని విజయసాయి రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదయిన వారంతా ఇక్కడ కూడా నమోదు చేసుకున్నారని, రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని తెలిపారు.
డూప్లికేట్ ఓట్లపైనా...
ఎక్కడా బోగస్ ఓట్లు లేవని జిల్లా కలెక్టర్లు నివేదిక ఇచ్చారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఆరు అంశాాలపై తాము సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.టీడీపీ మ్యానిఫేస్టో పేరుతో ఒక వెబ్‌సైట్ పెట్టి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను, ఏపీలో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఒకే ఫేజ్ లో పెట్టాలని సీఈసీని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు.