నేడు ఏపీకి కార్తీక పౌర్ణమి
తెలుగుదేశం పార్టీ అంతమైపోతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.;
తెలుగుదేశం పార్టీ అంతమైపోతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 2024 ఎన్నికల తర్వాత ఇక టీడీపీ అనేది కన్పించకుండా పోతుందన్నారు. చంద్రబాబు గ్రహణం పట్టిందని, రాష్ట్రానికి కార్తీక పౌర్ణమి అని విజయసాయిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు పూర్తి స్థాయిలో ప్రవాసాంధ్రుడుగా విశ్రాంతి తీసుకోవచ్చని అని ఆయన అన్నారు.
టీడీపీీ పని అయిపోయింది....
గత ఎన్నికల్లో లోకేష్ ఓటమి, నేడు కుప్పంలో టీడీపీ ఓటమితో ఆ పార్టీ ఫినిష్ అయిపోయిందన్నారు. చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుుకుంటే బెటర్ అని, ఆయన ఎన్ని వ్యవస్థలను అయినా మేనేజ్ చేయవచ్చేమో కాని, ప్రజలను మాత్రం మేనేజ్ చేయలేరని అర్ధం చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు.