అమరావతిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
అమరావతికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమరావతికి చేరుకున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది
అమరావతికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమరావతికి చేరుకున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలా? వద్దా? అన్న దానిపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతనే వీరు నలుగురు విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రానుంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాను అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని స్పీకర్ కు సమాచారం అందించారు.
టీడీపీకి చెందిన...
మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా కొందరు తాడేపల్లికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చారు. అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వారిపై పార్టీ నుంచి వచ్చిన పిటీషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారు. ఈరోజు స్పీకర్ ఎదుట హాజరు కావాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎనిమిది మందిలో ఎంతమంది హాజరవుతారన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది.