పవన్ పై సెన్సేషనల్ ట్వీట్ చేసిన విజయసాయి

వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు

Update: 2024-12-06 11:11 GMT

Vijaya Sai Reddy 

వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశిస్తూ కొత్త రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్రదేశ్‌కు 75 ఏళ్ల వృద్ధుడు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌న్నారు. నేష‌న‌ల్ పాప్యులారిటీ, వ‌య‌స్సు రీత్యా రాష్ట్రాన్ని నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి...
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్‌డీఏ పార్టీల నాయ‌కుల్లో అత్యంత ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ అని విజయసాయి రెడ్డి కొనియాడారు. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాతో వైర‌ల్ అవుతోంది. దీనిపై జ‌న‌సేన శ్రేణులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. మరోవైపు సాయిరెడ్డి ట్వీట్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News