వారందరికీ ప్రోత్సాహకాలు అందించనున్న సీఎం జగన్.. అకౌంట్లలోకి డబ్బులు!!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన

Update: 2023-12-20 03:17 GMT

 jagan anna videshi vidya deevena

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద.. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ. 1 లక్ష ప్రోత్సాహకం అందిస్తుండగా.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ. 50 వేల ప్రోత్సాహకం అందిస్తున్నారు.

ఈరోజు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆడుదాం ఆంధ్రాలో వర్చువల్‌గా పాల్గొననున్నారు సీఎం జగన్. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఐజీఎమ్ స్టేడియంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు, హై–టీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.


Full View


Tags:    

Similar News