నేడే సీఎం జగన్ కుప్పం పర్యటన!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో

Update: 2024-02-26 02:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో సోమవారం పర్యటించనున్నారు.ఉదయం 9.45 గంటలకు సీఎం తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి రాజుపేటకు చేరుకుంటారు.10.30 గంటలకు హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని విడుదల చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 11.05గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లెకు చేరుకుంటారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించాక కొత్త చెరువుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 11.45 నుంచి మధ్యాహ్నం 1.10 వరకు బహిరంగసభలో పాల్గొంటారు.

హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్‌ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు.


Tags:    

Similar News