Ys Jagan : మంగళగిరి సీటు చేనేత మహిళకు ఇచ్చాను.. ఇక మీదే బాధ్యత

చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. మంగళగిరిలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు;

Update: 2024-04-13 07:23 GMT

చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. మంగళగిరిలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. చేేనేత కుటుంబాలను ఆదుకుంది ఒక్క తమ ప్రభుత్వంలోనేనని చెప్పారు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చేసిన పనులు చేశారా? అని ప్రశ్నించారు. చేనేత రంగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. నేతన్నల సంక్షేమం కోసం 3,760 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. గతంలో లంచాలు ఇస్తేనే సంక్షేమ పథకాలు దక్కేవని, కానీ ఇప్పుడు ఎలాంటి వివక్ష లేకుండా పథకాలను ఇంటికే ఇస్తున్నామని తెలిపారు.

చేనేత రంగానికి...
మంగళగిరిలో తాను చేనేత రంగానికి చెందిన మహిళకు టిక్కెట్ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ మంగళగిరి, కుప్పంలో బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా చంద్రబాబు వాళ్లకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. దేశ చరిత్రలో లేని విధంగా 50 శాతం బీసీలకు కేటాయించామని ఇచ్చారు. వంద సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామన్నారు. పార్లమెంటు, శాసనసభలో అడుగుపెట్టేందుకు వాళ్లంతా సిద్ధం అంటూ ముందుకు వస్తున్నారన్నారు. గత పాలనకు ఇప్పటికి, తేడా చూడమని అన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు చేనేత రంగానికి మంగళగిరి, ఎమ్మిగనూరులో ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీలుగా కూడా చేశామన్నారు. ఎనిమిది చోట మున్సిపల్ ఛైర్మన్ లుగా చేనేతలను చేశామని తెలిపారు.


Tags:    

Similar News