Ys Jagan : నా నుదుటి మీద దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు... మన గెలుపును ఎవరూ ఆపలేరు

తనమీద రాయి విసిరినంత మాత్రాన జగన్ బెదిరిపోడని వైఎస్ జగన్ అన్నారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Update: 2024-04-15 12:27 GMT

తనమీద రాయి విసిరినంత మాత్రాన జగన్ బెదిరిపోడని వైఎస్ జగన్ అన్నారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో గెలుపు కౌరవులు నెగ్గినట్లు కాదన్నారు. ఒక రాయి విసిరినంత మాత్రాన మీ బిడ్డ అదరడు.. బెదరడు అని అన్నారు. తన నుదుటి మీద చేసిన గాయంతో సంకల్పం మరింత పెరిగిందన్నారు. ఎన్నికల సంగ్రామంలో చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ తన పైన దాడికి దిగుతున్నారన్నారు. ఆ దేవుడు నా నుదుట మీద పెద్ద స్క్రిప్ట్ రాశాడన్నారు. ఒక్క జగన్ పై ఎంత మంది దాడి చేస్తున్నారో అందరూ చూశారని అన్నారు. తనపై రాయి దాడి జరిగిన తర్వాత తొలిసారి గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

విజయానికి చేరువలో ఉన్నట్లే...
పేదలకు మంచి చేయకూడదని చంద్రబాబు భావించి అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియా ఇద్దామంటే వద్దనిందీ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే అడ్డుపడిందీ ఈ చంద్రబాబు కాదా? అని జగన్ ప్రశ్నించారు. తనపై దాడి చేయించేంత స్థాయికి వారు దిగజరారారంటే మనం విజయానికి చేరువలో ఉన్నట్లేనని అన్నారు. మన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వవద్దని చెప్పిందీ కూడా ఈ చంద్రబాబు అని అన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, ఆయనకుర్చీని లాక్కుని, ఆయన ప్రాణం పోవడానికి కారణమైన చంద్రబాబు అని అందరికీ తెలుసునని అన్నారు. ఎన్నికలకు వచ్చినప్పుడల్లా రామారావు ఫొటో తీసి జనంలోకి రావడం చంద్రబాబు ఒక్కడికే సాధ్యమని జగన్ ఎద్దేవా చేశారు.
దొంగ వాగ్దానాలతో...
దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలో దొంగచేతికి తాళాలివ్వడమే అన్నట్లుగా చంద్రబాబును నమ్మితే మళ్లీ మోసపోయినట్లే. వైసీపీ అధికారంలోకి వచ్చిన యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంత మార్పు వచ్చిందో గమనించాలని కోరారు. గ్రామ గ్రామాన సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్నారు. సంక్షేమంలో ఎవరికీ అందని విధంగా 2.75 లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారులకు నేరుగా అందచేశామని తెలిపారు. మీ బ్యాంకు అకౌంట్లను పదేళ్లలో పరిశీలిస్తే ఎవరి హయాంలో మంచి జరిగిందో అర్థమవుతుందన్నారు. జగన్ మార్కు అభివృద్ధి ప్రతి గ్రామంలో కన్పిస్తుందన్నారు.


Tags:    

Similar News