నేడు అనకాపల్లి జిల్లాకు జగన్

ముఖ్యమంత్రి జగన్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు

Update: 2023-01-05 02:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు యలమంచిలికి చేరుకుంటారు.

అడారి కుటుంబాన్ని....
యలమంచిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అడారి ఆనంద్ నివాసానికి చేరుకుంటారు. ఆయన తండ్రి, విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావునిన్న మరణించిన సంగతి తెలిసిందే. అడారి తులసీరావు భౌతికకాయం వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News