తన పేరు మీదున్న భూములను వారికి రాసిచ్చేసిన వైఎస్ షర్మిల

త‌ల్లితో క‌లిసి ష‌ర్మిల‌, ఆమె కుమారుడు, కుమార్తె బ‌స చేయ‌నున్నారు. జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ

Update: 2023-07-07 16:00 GMT

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. షర్మిల, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుండి ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుండి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొన్నారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాలను షర్మిల తన తనయుడు రాజారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుండి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వారి కుటుంబం ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుంది.

త‌ల్లితో క‌లిసి ష‌ర్మిల‌, ఆమె కుమారుడు, కుమార్తె బ‌స చేయ‌నున్నారు. జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. అనంత‌రం హైద‌రాబాద్‌కు వెళ్తారు. అక్క‌డి నుంచి పాలేరుకు వెళ్తారు. పాలేరులో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో త‌న భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాన్ని ష‌ర్మిల ప్ర‌క‌టించ‌నున్నారు.


Tags:    

Similar News