Ys Sunitha : జగన్ ను ఓడించండి... న్యాయం గెలిపించండి

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని వైఎస్ సునీత ఆరోపించారు.

Update: 2024-03-15 07:51 GMT

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని వైఎస్ సునీత ఆరోపించారు. కడపలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి సంస్మరణ సభలో సునీ ప్రసంగించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పడు జగన్ చెప్పిన మాటలను మరిచిపోయారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అండగా నిలిచారన్నారు. ఈప్రాంత ప్రజలంటే ఆయనకు ఎంతో ప్రేమ అని సునీత అన్నారు. అతి కిరాతకంగా వైఎస్ వివేకాను చంపిన వారిని, చంపించిన వారిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడం ఏంటని కసునీ ప్రశ్నించారు. వైఎస్ వివేకా ఆత్మ సాక్షి ద్వారా సంకల్పం చేసి జగన్ ను ఓడించాలని ఆమె పిలుపు నిచ్చారు.

తనపైనే నిందలా?
నేరస్థులకు శిక్షపడేలా పోరాటం చేస్తున్న తనకు సహకరించకపోగా, తనపైనే హత్యారోపణలు చేయడం ఎంత వరకూ సబబని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ చేతకానితనం కాదా? అని ఆమె నిలదీశారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని సునీత అన్నారు. మీ చిన్నాన్నను చంపిన వాళ్లను గుర్తించి వారికి శిక్ష పడేలా చేయాల్సిన కనీస బాధ్యత లేదా? అని జగన్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా తాము పోరాడతామని, జగన్ కు ఓటు వేయవద్దని సునీత పిలుపు నిచ్చారు. ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని ఆమె కోరారు. జగన్ ను నమ్ముకుంటే ఎవరికీ న్యాయం జరగదని ఆమె అన్నారు.


Tags:    

Similar News