వైసీపీకి మరో ఎదురుదెబ్బ

రాజధాని ప్రాంతంలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి

Update: 2021-11-18 07:35 GMT

రాజధాని ప్రాంతంలో వైసీపీికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ కొంత పుంజుకుంది. ఈరోజు జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ రాజధాని ప్రాంతంలో విజయం సాధించడం విశేషం. ప్రధానంగా రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో రెండు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.

వరస ఓటములు....
తాడికొండ నియోజకవర్గంలో ఉన్న రెండు ఎంపీటీసీలు టీడీపీ పరమయ్యాయి. గుండాలపాడు, వేమవరం ఎంపీీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించిన తర్వాత తాడి కొండ నియోజకవర్గంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీకి ఇక్కడ పరాభవం ఎదురయింది.


Tags:    

Similar News