YSRCP : నేడు 14వ వసంతంలోకి వైసీపీ... రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు

నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

Update: 2024-03-12 03:12 GMT

YSRCP :నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేసి నేతలు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇప్పటికి పదమూడేళ్లు అయింది. పథ్నాలుగో ఏట వైసీపీ అడుగు పెట్టింది. 2014లో ఒంటరిగా పోటీ చేసిన వైఎఎస్సార్సీ తృటిలో అధికారాన్ని కోల్పోయింది. అయితే జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల మనసులను గెలుచుకుని 2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు.

అత్యధిక ఓట్లతో...
దాదాపు యాభై శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాల్లో గెలిచింది. రాజ్యసభలో అత్యధిక సభ్యులున్న పార్టీగా వైసీపీ మరో రికార్డు అతి తక్కువ సమయంలోనే నమోదు చేసుకుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడులకను ఘనంగా నిర్వహించాలని నేతలకు వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలను నేడు నిర్వహిస్తున్నాయి.


Tags:    

Similar News