Breaking : వైసీపీ నేతలకు షాకిచ్చిన హైకోర్టు

వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేతల బెయిల్ పిటీషన్లను తిరస్కరించింది;

Update: 2024-09-04 05:33 GMT

andhra pradesh high court

వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేతల బెయిల్ పిటీషన్లను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, తలసిల రఘురాం అప్పిరెడ్డితో పాటు మరికొందరు నేతలు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు నేడు బెయిల్ పిటీషన్ ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది.

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ మాజీ మంత్రి జోగి రమేష్ కు చుక్కెదురయింది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను ఇప్పటికే పోలీసులు విచారించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా దానిని కూడా తిరస్కరించింది. అయితే రెండు వారాల పాటు వారిపై చర్యలు తీసుకోకుండా ఆర్డర్ ఇవ్వాలని వైసీపీ తరుపున న్యాయవాదులు కోరారు.


Tags:    

Similar News