సీపీఐ నారాయణకు వైసీపీ ఎంపీ చికిత్స

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు వైసీపీ ఎంపీ గురుమూర్తి చికిత్స చేశారు.

Update: 2021-11-23 14:53 GMT

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు వైసీపీ ఎంపీ గురుమూర్తి చికిత్స చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారాయణ కాలికి గాయం అవ్వడంతో అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రాధమిక చికిత్స చేశారు. నారాయణ ఈరోజు చిత్తూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరుకు చేరుకున్న నారయాణ రాయల చెరువు కట్టను పరిశీలించేందుకు కొండను ఎక్కారు. కొండ దిగే సమయంలో నారాయణ జారి పడ్డారు. కాలు బెణకడంతో నారాయణ అక్కడే కూర్చుండి పోయారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో....
అదే ప్రాంతానికి వైసీపీ నేతలు పర్యటనకు వచ్చారు. మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చారు. అక్కడే కూర్చుని ఉన్న నారాయణను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే డాక్టర్ అయిన గురుమూర్తి నారాయణకు ఫిజియోథెరపీ చేశారు. కట్టు కట్టారు. వెంటనే వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తన వాహనంలో నారాయణను ఆసుపత్రికి తీసుకెళ్లారు.


Tags:    

Similar News