అమరావతిలో వైసీపీ సాధికార యాత్ర గ్రాండ్ సక్సెస్

పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది.;

Update: 2023-11-11 09:19 GMT
YSRCP, Amaravati, Yatra, ycp leaders, Amaravathi
  • whatsapp icon

పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గాల నుంచి ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంపీ నందిగం సురేష్ , ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎంపీ బీద మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు, పైలా సోమినాయుడు సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్నారు. ధరణికోట జేబీ గార్డెన్స్ నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు.



 


పాదయాత్రగా నడుస్తూ మొదట ధరణికోట హోసన్నా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ధరణికోట గాంధీ బొమ్మ సెంటర్ లో మహిళలు హారతులు పట్టి నేతలకు స్వాగతం పలికారు. అమరావతి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ధరణికోట జేబీ గార్డెన్స్ నుంచి అమరావతి రథం సెంటర్ వరకు జరిగిన పాదయాత్రలో సుమారు 20 వేల మందికి పైగా పాల్గొన్నారు.


తాళ్లచెరువు నుండి తరలి వెళ్లిన కార్యకర్తలు.

 



Tags:    

Similar News