మీరెందుకు అంత బాధపడిపోతున్నారు... మీ బావగారనా: వైసీపీ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి

Update: 2023-09-09 06:09 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు. నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని పురందేశ్వరి అన్నారు. దీనిపై వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తీవ్రంగా స్పందించింది. "మీరెందుకు అంత బాధపడిపోతున్నారు... మీ బావగారనా?" అంటూ పోస్టు పెట్టింది. "ఇంతకీ మీరు రాష్ట్రాధ్య‌క్షురాలిగా ఉన్న‌ది ఏపీ బీజేపీకా లేక తెలుగుదేశం పార్టీకా? వందల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే, దానిపై మీ స్పందన చూసిన వారెవరికైనా ఇలాంటి సందేహమే కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందుకే అరెస్ట్ చేశారు. మీకెందుకు బాధ!" అంటూ వైసీపీ విమర్శించింది.

చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. "ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది." అంటూ పోస్టు పెట్టారు.


Tags:    

Similar News