పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారంటే?

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు

Update: 2024-07-09 02:05 GMT

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లోని ఈవీఎంను పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు. విచారణలో తొలి రోజు పిన్నెల్లి ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది. అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడగ్గా.. వాటిలో 30 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదట!!

నేను వెళ్ళలేదు.. నాకు తెలియదు:
పిన్నెల్లి ముందు పలు ప్రశ్నలు వేయగా.. ఆయన మాత్రం నేను వెళ్లలేదు, వారెవరూ తనకు తెలియదనే సమాధానం ఇచ్చారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని, ఆ రోజు తన వెంట గన్‌మెన్లు లేరని సమాధానాలు ఇచ్చారని అంటున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసంతో పాటు రెండు హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేశారు. రెండు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్డు రిమాండ్ విధించింది.


Tags:    

Similar News