YSRCP: వెనక్కు తగ్గని వైసీపీ.. ఆ మాజీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిందిగా!!

ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలో చాలా మార్పులే వస్తున్నాయి

Update: 2024-07-10 03:14 GMT

వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలో చాలా మార్పులే వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి.. సొంత పార్టీ నేతలేనని తెలిసి ఏ మాత్రం తగ్గకుండా సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా కదిరి నియోజకవర్గం విషయంలో వైసీపీ దూకుడైన చర్యలు తీసుకుంది. 2019లో గెలిచి.. 2024 ఎన్నికల్లో సీటు దక్కించుకోలేకపోయిన మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు.

కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందగా,, సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.
డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి 2019 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల సమయంలో కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మార్చేసింది. మైనార్టీ నేత మక్బూల్ అహ్మద్‌ను పోటీ చేయించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ చేతిలో మక్బూల్ అహ్మద్‌ 6,265 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


Tags:    

Similar News