పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఎంత మంది నారతీశారు: రోజా
తిరుపతి జిల్లా వడమాలపేటలో బాలికపై హత్యాచారం జరిగిన
తిరుపతి జిల్లా వడమాలపేటలో బాలికపై హత్యాచారం జరిగిన ఘటనపై రోజా మండిపడ్డారు. ఆమె బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్లే నేరస్తులు తెగబడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ఈ ఘటనలు జరుగుతుండడం చూసి సిగ్గుపడాలని అన్నారు. ఆడవాళ్లను ఎవరైనా బాధపెడితే తొక్కిపట్టి నారతీస్తానని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారని, ఇప్పటిదాకా 100 మంది ఆడబిడ్డలు ప్రాణాలు వదిలితే, ఎంతమందికి పవన్ నారతీశారో చెప్పాలన్నారు. చేతిలో అధికారం ఉండి కూడా, నేరగాళ్లలో భయం కల్పించలేకపోతున్నారని రోజా వ్యాఖ్యానించారు.
వడమాట పేట మండలంలో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. సుశాంత్ (22) తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను చంపేసి అక్కడే పూడ్చిపెట్టేశాడు. రాత్రి అవుతున్నప్పటికీ పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వడమాల పేట మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా జరిగిన విషయం తెలిపాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.