వల్లభనేని వంశీకి హైకోర్టులో?
వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది.;

వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయాలంటూ వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఇప్పటికే అరెస్టయి
అయితే ఇప్పటికే టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్థన్ ను బెదిరించి, కిడ్నాప్ వంటి కేసులతో ఆయన అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదయింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టు కొట్టి వేయడంతో వంశీ వర్గీయులు డీలా పడ్డారు.