అమిత్ షాను కలిసి ఏం చెప్పారంటే?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలపై వారు చర్చించారు.;

Update: 2021-12-08 02:07 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలపై వారు చర్చించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు అమిత్ షాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా అమిత్ షాను వారు కోరినట్లు తెలిసింది. రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయీల విషయం కూడా వారు ఈ సందర్భంగా అమిత్ షా దృష్టిికి తీసుకెళ్లారు.

వరద సాయం....
దీంతో పాటు ఇటీవల గజేంద్ర షెకావత్ సభలో ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కూడా వైసీీపీ ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వరదల కారణంగా సంభవించిన నష్టానికి వెంటనే సాయం అందించాలని వారు కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని వారు సమర్పించారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలు అమిత్ షాను కలిశారు.


Tags:    

Similar News