బాబు పై విజయసాయి సెటైర్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు

Update: 2022-02-26 13:09 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నిన్నటికి 44 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబుకు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెబుతూనే సెటైర్లు వేశారు. చంద్రబాబు తొలుత చంద్రగిరి నుంచి పోటీ చేసి కొంగర పట్టాభిరామ చౌదరిపై నెగ్గారన్నారని, ఆయన ప్రజాప్రస్థానంపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యే కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

ప్రతిపక్ష నేతగానే....
కానీ రాజకీయ జీవితంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూనే విజయసాయిరెడ్డి మరో 44 ఏళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా గల్లంతయితే మనవడితో ఇంట్లో కూర్చుని ఆడుకోవాలని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.


Tags:    

Similar News