YSRCP : ఒంగోలులో వైసీపీకి షాక్
ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది;

ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ఇరవై మంది కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వారంతా జనసేనలో చేరుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో వారంతా జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారంతా విజయవాడ చేరుకున్నారని తెలిసింది.
జనసేనలోకి...
ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ బలం ఎక్కువగా ఉంది. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆయన వెంట కార్పొరేటర్లు కూడా నడుస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ లో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరుతుండటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.