నా బతుకు ఇక్కడే ముడిపడి ఉంది

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టడంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు

Update: 2022-01-07 12:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టడంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. ఏపీలో పార్టీ పెట్టాలని అడిగితే ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు అని మాత్రమే చెప్పానని షర్మిల తెలిపారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందని షర్మిల అన్నారు. తాను తెలంగాణను వదిలి రాలేనని పరోక్షంగా షర్మిల చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రేమించిన ఈ ప్రజల కోసం సేవ చేయాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

అది మూర్ఖత్వమే....
ఎల్లప్పుడూ అధికారంలో ఉంటాననుకోవడం మూర్ఖత్వమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. అధికారంలో లేని వారు అధికారంలోకి రాకూడదన్న గ్యారంటీ ఏమీ లేదన్నారు. పాలిటిక్స్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయని వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో చెప్పారు.


Tags:    

Similar News