ఒక్కో బనారస్‌ చీర ఖరీదు రూ.6 లక్షలు.. నీతా అంబానీ ఎన్ని ఆర్డర్‌ చేశారో తెలుసా?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో జూలై 12న

Update: 2024-07-11 14:02 GMT

Sarees

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో జూలై 12న పెళ్లి జరుగనుంది. అయితే ప్రీవెడ్డింగ్‌ వేడుక నుంచి పెళ్లి రిసెప్షన్‌ వరకు అన్ని ప్రత్యేకమే. ఇక అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ధరించి బట్టలు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. నీతా అంబానీకి బనారసీ చీర అంటే చాలా ఇష్టం.

నీతా అంబానీ ఏ బాలీవుడ్ నటి కంటే పెద్ద స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారింది. కానీ బనారసీ చీరపై ఆమెకున్న ప్రేమ చాలా మందికి తెలిసిందే. తన కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలలో ఆమె తరచుగా బనారసి చీరలో కనిపిస్తుంటారు. వీరి పెళ్లి సందర్భంగా ఇటీవల ఆమె కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా నీతా అంబానీ ఆమె డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి బనారస్ వీధుల్లో కూడా తిరిగారు.




 


అక్కడి వీధుల్లో తిరుగుతూ బనారసీ చీరల నేత కార్మికులతో పాటు చేనేత వస్త్రాల యజమానులను కూడా కలిశారు. ఆమె దాదాపు 50 నుండి 60 బనారసీ చీరలను ఆర్డర్ చేశారు. ఇందులో కొన్ని చీరలు ఒక్కో చీర కనీస ధర రూ.1.5 నుంచి 2 లక్షల వరకు ఉండగా, మరి కొన్ని చీరల్లో ఒక్కో చీర రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. నీతా అంబానీ స్వయంగా బనారస్‌కు వచ్చి బనారసీ చీరను కొనుగోలు చేశారు. నీతా అంబానీ బనారస్ పర్యటనలో కేవలం చీరల కొనుగోలు మాత్రమే చేయలేదు.

బనారస్‌లోని ప్రసిద్ధ కాశీ చాట్ భండార్ నుండి టొమాటో చాట్‌తో పాటు, పాలక్‌ చాట్, ఆలూ టిక్కీ, చనా కచోరీ కూడా అందించనున్నారు. వీటిని ప్రత్యేక కుల్హార్‌లో అతిథులకు ఇవ్వనున్నారు. ఇందుకోసం 10 మందికి పైగా కళాకారుల బృందం అక్కడికి చేరుకుంది.

Tags:    

Similar News