Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

Bank Holidays in February-2024: చాలా మంది ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్తుంటారు. అయితే నెల వచ్చిందంటే బ్యాంకులకు

Update: 2024-01-30 02:58 GMT

Bank Holidays

Bank Holidays in February-2024: చాలా మంది ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్తుంటారు. అయితే నెల వచ్చిందంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే సమయం వృధాతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినెల బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఫిబ్రవరిలో 11 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. సెలవులను గమనించి బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. వివిధ రాష్ట్రాల కార్యక్రమాలు, పండగలను బట్టి ఉంటాయని గమనించడండి.

ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవుల జాబితా

ఫిబ్రవరి 4 – ఆదివారం

ఫిబ్రవరి 10- రెండో శనివారం

ఫిబ్రవరి 11 – ఆదివారం

ఫిబ్రవరి 14 – వసంత పంచమి, సరస్వతి పూజ

ఫిబ్రవరి 15 – లుయి గాయి నీ (ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు)

ఫిబ్రవరి 18 – ఆదివారం

ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌ల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఫిబ్రవరి 20- రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగర్ ల్లో బ్యాంకుల మూసివేత.

ఫిబ్రవరి 24- నాలుగో శనివారం

ఫిబ్రవరి 25- ఆదివారం

ఫిబ్రవరి 26 – న్యోకూమ్ (ఇటా నగర్‌లో బ్యాంకులకు బంద్‌).

Tags:    

Similar News