Tax Saving: ట్యాక్స్‌ను ఆదా చేసుకునే బెస్ట్‌ స్కీమ్స్‌ ఇవే

Tax Saving: ఈ రోజుల్లో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందవచ్చు.

Update: 2024-01-10 12:23 GMT

Tax Saving

Tax Saving: ఈ రోజుల్లో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందవచ్చు. కానీ కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పీపీఎఫ్‌: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఇది మీరు హామీతో కూడిన రాబడిని పొందే స్కీమ్‌. మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. పీపీఎఫ్‌ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అంటే ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. పీపీఎఫ్‌లో చేసిన పెట్టుబడులు ఈఈఈ కేటగిరీలో ఉంచారు. అంటే మీ పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ (ELSS): మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) అటువంటి ఎంపికలలో ఒకటి. ఇది మంచి రాబడితో పాటు పన్ను ఆదాను అందిస్తుంది. ఇందులో కూడా మీరు సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ELSS అనేది అతి తక్కువ లాక్-ఇన్ వ్యవధి కలిగిన ఉత్పత్తి. ELSSలో పెట్టుబడిని 3 సంవత్సరాల వరకు రీడీమ్ చేయడం సాధ్యం కాదు. అయితే, మీరు దాని నష్టాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టాలి.

సుకన్య సమృద్ది యోజన పథకం: కుమార్తెపై తండ్రి ఆమె భవిష్యత్తు కోసం డబ్బును కూడబెట్టుకునే స్కీమ్‌ సుకన్య సమృద్ది యోజన పథకం.ఈ పథకంలపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంపై చేసిన డిపాజిట్‌పై మీరు 80C కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. ఈ పథకంలో కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల కోసం అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ఇది ప్రభుత్వ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD): మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే 5 సంవత్సరాలకు ఎఫ్‌డీ చేస్తే, మీరు దానిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. అందుకే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు బ్యాంకుల్లోనే కాకుండా పోస్టాఫీసుల్లో కూడా పన్ను ఆదా చేసే FD ఎంపికను పొందుతారు. వడ్డీ రేట్లు ప్రతిచోటా మారుతూ ఉంటాయి. మీరు వడ్డీ రేటును చూసి మీ సౌలభ్యం ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 80C కింద పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS): సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది వృద్ధుల కోసం ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక పథకం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ చేసిన మొత్తంపై 8.20 శాతం వడ్డీని పొందుతున్నారు. ఈ పథకం కింద రూ.1000 నుంచి రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం సీనియర్ సిటిజన్లకు చాలా ప్రయోజనకరమైన ఒప్పందం. దీని ద్వారా, ఖాతాదారులు ITR ఫైల్ చేయడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (NSC): నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కూడా సురక్షితమైన, హామీతో కూడిన రాబడిని అందించే పథకం. ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. NSCలో పెట్టుబడిని రూ. 1000తో ప్రారంభించవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం దానిపై 7.7 శాతం వడ్డీ ఇస్తోంది. దేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఇందులో కూడా, 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.

నేషనల్ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS): మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే, మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే NPSలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 80సీ కింద మినహాయింపు, 80సీసీడీ(1బీ) కింద రూ.50 వేల పన్ను మినహాయింపు పొందవచ్చు. పదవీ విరమణ ప్రణాళిక కోసం ఇది మంచి పథకం. ఇందులో మీరు ప్రతి సంవత్సరం పెట్టుబడిపై పన్ను మినహాయింపుతో పాటు వృద్ధాప్యంలో పెన్షన్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

Tags:    

Similar News