Gold Prices Today : ఇలా పెరిగిపోతున్నాయేంటి బాసూ.. ఇక ఆగడం కష్టమేనా?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి

Update: 2024-05-29 04:18 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ధరలు పెరగుతూనే పోతున్నాయి. మూడు రోజుల నుంచి ధరలు అదుపులోకి రావడం లేదు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. సీజన్ కాకపోయినా బంగారం, వెండి ధరలు ఇలా పెరగడమేమిటి అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం మాత్రం దొరకడం లేదు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు అనేక కారణాలతో పెరుగుతుంటాయి. అందుకు చెప్పే కారణాలు రోజూచెప్పే వయినా ధరలు పెరిగాయా? తగ్గాయా? అన్నదే చూడటానికే కొనుగోలుదారులు పరమితమయ్యారు.

సీజన్ కాకున్నా...
మూఢమి కదా.. బంగారం నేలచూపులు చూస్తుందని భావించిన వారికి నిరాశ తప్పడం లేదు. వెండి ధర కిలో లక్ష రూపాయలు దాటింది. పది గ్రాముల బంగారం ధర కూడా 75 వేల రూపాయలకు చేరువలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి అది ఎనభై వేల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదన్నది మార్కెట్ నిపుణుల అంచనా. డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో పాటు బంగారం నిల్వలు తగినన్ని లేకపోవడం వల్లనే ధరలు రోజూ పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
భారీగా పెరిగి...
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు బంగారం, వెండి సొంతం చేసుకోవడానికి ఒక అడుగు వెనకేస్తున్నారు. అది సహజమే అయినప్పటికీ అవసరాలు, కుటుంబంలో జరిగే వేడుకలకు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,860 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,940 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,01,100 రూపాయలకు చేరుకుంది.



Tags:    

Similar News